- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులను వేధించడం మానుకోండి
కష్టపడి పండించిన కూరగాయలను విక్రయించడానికి మార్కెట్ కు తీసుకువస్తే వివిధ రకాల పన్నులు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి ఆరోపించారు.

దిశ, కామారెడ్డి : కష్టపడి పండించిన కూరగాయలను విక్రయించడానికి మార్కెట్ కు తీసుకువస్తే వివిధ రకాల పన్నులు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి ఆరోపించారు. గురువారం భారతీయ కిసాన్ సాంగ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇట్టి కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, కామారెడ్డి మార్కెట్లో థాయ్ బజార్ వారు రైతులు తెచ్చిన కూరగాయల పై విచ్చలవిడిగా వసూలు చేస్తున్న డబ్బులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలోని కూరగాయల మార్కెట్లో సరైన టాయిలెట్స్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిల్లా గౌరవ అధ్యక్షులు విట్టల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి అర్ల శంకర్రావు, కామారెడ్డి మండల అధ్యక్షులు కొమిరెడ్డి చిన్న అంజన్న, ప్రధాన కార్యదర్శి లక్కాకుల భాస్కర్, భైరవరెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.






