- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏర్గట్ల విద్యార్థులకు రాష్ట్రస్థాయి సాహిత్య అకాడమీ పురస్కారాలు
దిశ, ఏర్గట్ల : తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కథలు, కవితలు,

దిశ, ఏర్గట్ల : తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కథలు, కవితలు, నాటికల విభాగాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో శనివారం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీల్లో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జక్కని వైష్ణవి నాటికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి, కవితా విభాగంలో ప్రోత్సాహక బహుమతిని అందుకున్నట్లు పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన కథల సంకలన గ్రంథంలో పదవ తరగతి చదువుతున్న రిశ్వంత్, ఎనిమిదవ తరగతి చదువుతున్న రాజేష్ రాసిన కథలు ప్రచురితమయ్యాయని చెప్పారు. వీరి సాహిత్య ప్రతిభను అకాడమీ ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలిపారు. బహుమతి ప్రధానోత్సవ సభలో రూరల్ డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ పి. రవీందర్, రవీంద్ర భారతి కార్యదర్శి బాలా చారి, బాలచెలిమి పత్రిక సంపాదకులు మణికొండ వేద కుమార్ చేతుల మీదుగా విద్యార్థులు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య రంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్న తెలుగు పండితులు ప్రవీణ్ శర్మను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.






