- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలవరపెడుతున్న SRSP నీటిమట్టం.. ఇలా అయితే ఎలా..?
ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది.

దిశ, బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరి ప్రాజెక్టు నిండుకుండల మారి మిగులు జలాలను దిగువన ఉన్న గోదావరిలోకి, కాలువలకు, ఆయకట్టుకు సరిపడా నీటిని సరఫరా చేస్తుంది. అదే మాదిరిగా (2024 జూన్ నుంచి 2025 ఏప్రిల్ వరకు) 289 టీఎంసీల వరద ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు నీటి విలువ 11.3 టీఎంసీలు మాత్రమే. శ్రీరామ్ సార్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా 1060.80 అడుగులు 11.335 టీఎంసీ ల నీటి నిల్వ వుంది. ఎగువ ప్రాంతాల నుంచి వర్షాకాలంలో వచ్చిన వరద 289 టిఎంసి లు. కాగా గోదావరిలోకి ఎస్సారెస్పీ ప్రధాన వరద గేట్లు ద్వారా 108 ఎస్కేప్ గేట్ల నుంచి 9 టీఎంసీలు మొత్తం 117 టీఎంసీల మిగులు జలాలను గోదావరిలోకి వదిలేశారు. మిగిలిన ఒక 172 టిఎంసిల నీటిని వరద కాలువ తో 49 టీఎంసీలు విడుదల చేశారు. లక్ష్మి, సరస్వతి, కాకతీయ కాలువలకు 101 టీఎంసీల నీటిని పంట పొలాలకు తాగునీటి అవసరాలకు వినియోగించారు.
ఆవిరి రూపంలో 12 టీఎంసీల నీరు పోయింది. మిషన్ భగీరథ తాగు నీటి కొరకు 6 టీఎంసీల నీటిని వినియోగించారు. లక్ష్మీ కాలువల ద్వారా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం లోని పలు మండలాలకు ఎత్తిపోతలతో, సరస్వతి కాలువతో నిర్మల్ జిల్లాలోని ఆయకట్టుకు నిరందించారు. కాకతీయ కాలుతో కరీంనగర్ ఎల్ఎండి ప్రాజెక్ట్ ఎగువన దిగువన ఉన్న ఆయకట్టుకు ఖరీఫ్, రబీ పంటలకు మీరు అందించారు. ప్రాజెక్టులో డేడ్ స్టోరోజీ 5 టీఎంసీలు పోగా మిగిలేది 6.335 టీఎంసీలు మాత్రమే. గత ఏడాది ప్రాజెక్టులో 1056.90 అడుగులు 7.912 టీఎంసీ ల నీటినిల్వ వుంది. గత ఏడాది కంటే నీటి నిల్వ ఈ ఏడాది 3.423 టీఎంసీ లు అధికంగా నీరు ఉంది. ప్రాజెక్టు నిర్మాణ దశలో 112 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించగా ప్రస్తుతం 80.5 టిఎంసిలకు పడిపోయింది. అంటే 32 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం పడిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉదృతంగా ప్రవహిస్తూ వస్తున్న వరదల కారణంగా దశాబ్ద కాలంగా వస్తున్న పూడిక... పేరుకుపోయి సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. పూడిక వలన రానున్న రోజులలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం మరింత తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నిపుణులు, అధికారులు, నాయకులు ప్రాజెక్టు కూడిక ను తొలగించి నీటి సామర్థ్యం పెంచితే రైతులకు ఎస్సారెస్పీ ఆయకట్టుకు డోకా లేదని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్వం వైభవం తెస్తారని రైతులు ఆశాభా వ్యక్తం చేస్తున్నారు.






