జుక్కల్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

by S Gopi |

జుక్కల్ మండల కేంద్రంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.... Sriramanavami festival celebrations in Jukkal

జుక్కల్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
X

దిశ, జుక్కల్: జుక్కల్ మండల కేంద్రంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మఠాధి గోపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించారు. వారం నుండి ప్రతిరోజు ప్రవచనాలు కీర్తనలు నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తులు ఎక్కువ సంఖ్యలో శ్రీరామనవమి వేడుకలు పాల్గొన్నారు. భక్తుల కోసం అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జుక్కల్ శ్రీరామనవమి వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున జాతరను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీపీ సుర్నర్ యశోద, నీళ్లు పటేల్, మాజీ మద్నుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, రాజు దేశాయ్, జుక్కల్ సర్పంచ్ బొంపల్లి రాములు, ఉప సర్పంచ్ భాను గౌడ్, బొంపెల్లి రాందాస్, పురుషోత్తం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story