- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి ఉపయోగపడుతాయి : దోమ వెంకటేష్
క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి ఉపయోగపడుతాయి : దోమ వెంకటేష్
by Ratna Kumari |
క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి ఉపయోగపడుతాయని దోమ వెంకటేష్ పేర్కొన్నారు.

X
దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి ఉపయోగపడుతాయని దోమ వెంకటేష్ పేర్కొన్నారు. గండీడ్ మండలం లింగాయపల్లిలో ఉగాది పండుగ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆయన గ్రామ పెద్దలతో కలిసి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దోమ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడా ప్రోత్సాహం పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువత శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించడంతో పాటు సామూహిక భావన పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటయ్య, రంగారెడ్డి, లక్ష్మయ్య టీచర్, బ్రహ్మానంద రెడ్డి, నర్సింహులు, శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






