ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

by Naveena |

పెండింగులో ఉన్న ఆస్తి పన్నుల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టాక్స్ డ్రైవ్ లో దూకుడుగా వ్వవహరిస్తున్నారు

ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పెండింగులో ఉన్న ఆస్తి పన్నుల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టాక్స్ డ్రైవ్ లో దూకుడుగా వ్వవహరిస్తున్నారు. శుక్రవారం జోన్ 2 పరిధిలోని బసప్ప వినాయక్ నగర్ ప్రాంతంలోని ఏడు షాపులను సీజ్ చేశారు. నగర శివారులోని ఖానాపూర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆస్తి పన్నులు బకాయి పడ్డ రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశారు. పన్నులు చెల్లించేందుకు రెండు రోజులు గడువు ఇచ్చారు. రైస్ మిల్లుల కొలతల్లో కూడా భారీగా తేడాలుండటం కారణంగా కార్పొరేషన్ కు రావాల్సిన పన్నులు చాలా తక్కువగా వస్తున్నాయని, తాజాగా రైస్ మిల్ కొలతలను కొత్తగా తీయించారు. స్పెషల్ డ్రైవ్ లో కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, జోనల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్, బిల్ కలెక్టర్, వార్డ్ ఆఫీసర్ టాక్స్ కలెక్షన్ టీం సభ్యులు పాల్గొన్నారు.

Next Story