- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.

దిశ, మద్నూర్ (నిజాంసాగర్) : మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. సోమవారం రూ.30 లక్షల మార్కెట్ కమిటీ నిధులతో మార్కెట్ కమిటీ కార్యాలయ మొదటి అంతస్తు లో మీటింగ్ హాల్, చైర్మన్ చాంబర్, నిర్మాణ పనులకు మార్కెట్ యార్డ్ పరిధిలో అంచనా వ్యాయం రూ.21 లక్షలతో మొరుగుదొడ్ల నిర్మాణ పనులకు నిర్మాణం కోసం మంజూరైన నిధులతో వాటి నిర్మాణం కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు శంకుస్థాపన చేస్తూ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు, రైతులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, శ్రీనివాస్ పటేల్, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.






