- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి నెల 100కు పైగా ఫోన్ల రికవరీ : ఎస్పీ రాజేష్ చంద్ర
సెల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి పొందవచ్చని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ, కామారెడ్డి : సెల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి పొందవచ్చని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా, అందులో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలకమైన డేటా కూడా ఉంటాయన్నారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ జె. నరేష్ పర్యవేక్షణలో ఆర్ ఎస్సై బాలరాజుతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి నెల సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తోందన్నారు.
గత ఏడాదిలో సుమారు ₹3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత 30 రోజుల్లో ₹21లక్షల విలువైన 134 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్టు తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4665 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు ₹7.46 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, సిమ్ కార్డును బ్లాక్ చేసి www.ceir.gov.in వెబ్‌సైట్‌లో ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయాలని కోరారు. మొబైల్ ద్వారానే సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున గుర్తు తెలియని లింకులు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.






