- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్ట్ అమలు : ఎస్పీ రాజేశ్ చంద్ర
దిశ, కామారెడ్డి : జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర పార్థి దొంగల ముఠాపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ, కామారెడ్డి : జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర పార్థి దొంగల ముఠాపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. 14 తీవ్రమైన దోపిడీ దొంగతన కేసుల్లో నిందితులకు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ యాక్టుతో ఒక సంవత్సర కాలం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితమవుతారన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న వారికి పీడీ ఆక్ట్ తప్పదని హెచ్చరించారు. జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల్లో భయం, అసురక్షిత వాతావరణం సృష్టించిన అంతర్రాష్ట్ర పార్థి దొంగల ముఠాపై కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుందన్నారు.ఈ క్రమంలో ఇప్పటికే ముఠా సభ్యులైన కృష్ణబాబు షిండే, నాందేవ్, రామ్ కిషన్ భోస్లే, రామ్ దాస్, అజిత్ రమేష్, అజయ్, పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్టు చెప్పారు.
ఈ ముఠాకు చెందిన మరో ప్రధాన నిందితుడు భాస్కర్ భాపురావ్ చవాన్ పై పీడీ యాక్టు అమలు చేస్తున్నామన్నారు. సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి, పిట్లం, బీర్కూర్, మద్నూర్ పోలీస్ స్టేషన్లతో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో మొత్తం 14 ప్రమాదకర దోపిడీ, చోరీ కేసుల్లో నేరాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ప్రస్తుతం అతను నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నాడన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజ్, గాంధారి యస్‌ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ వి.ఎల్. నర్సింలు నిజామాబాద్ సెంట్రల్ జైల్లో యాక్టు ప్రతులను నిందితులకు అందజేశారని తెలిపారు.






