- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారుణ్య నియామకాల్లో ఇద్దరికీ ఉద్యోగ ఉత్తర్వులు అందజేసిన ఎస్పీ
కారుణ్య నియామకాల్లో భాగంగా రెండు నెలలోపే ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అందజేశారు.

దిశ, కామారెడ్డి : కారుణ్య నియామకాల్లో భాగంగా రెండు నెలలోపే ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అందజేశారు. అయితే నియామక పత్రాలు అందుకున్న వెంటనే ఈరోజే సౌఖ్య, మానస లు విధుల్లో చేరారు. కారుణ్య నియామకాల్లో భాగంగా రెండు నెలల క్రితం విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ వడ్ల రవి భార్య సౌఖ్యకు, అలాగే అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుమార్తె మానసకు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు విడతలవారీగా కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. ఉద్యోగాల్లో నియమితులైన సౌఖ్య, మానసలకు అభినందనలు తెలుపుతూ, నిజాయితీగా విధులు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఓ యండి అప్సర్, సూపరింటెండెంట్లు గంగాధర్, జామీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.






