తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ.. తీవ్ర గాయాలతో కొడుకు మృతి

by Bhanu |

తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన కొడుకుకు మృతి చెందాడు.

తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ.. తీవ్ర గాయాలతో కొడుకు మృతి
X

దిశ, కామారెడ్డి : తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన కొడుకుకు మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ (24) అనే వ్యక్తి గల్ఫ్ కు వెళ్లాడు. గత మూడు నెలల క్రితం స్వగ్రామమైన లింగాపూర్ కు వచ్చాడు. అప్పటినుంచి వడ్ల నిఖిల్ గంజాయి, మద్యానికి, కల్లుకు బానిస అయ్యాడు. దీంతో ప్రతిరోజు తల్లిదండ్రులతో అతను గొడవ పడేవాడు. ఈ క్రమంలో నిఖిల్ తన తండ్రి భాస్కర్ తో గొడవకు దిగాడు. ఇద్దరు ఘర్షణ పడడంతో తండ్రి భాస్కర్ ఇనుప రాడ్ తో కుమారుడు నిఖిల్ పై దాడి చేశాడు. దీంతో నిఖిల్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిఖిల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు నిఖిల్ మృతికి కారణమైన తండ్రి భాస్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story