మహిళల ఆరోగ్యంతోనే సమాజానికి ప్రయోజనం

by Elthuri vijay kumar |

మహిళల ఆరోగ్యం పై దృష్టి పెడితేనే సమాజానికి ప్రయోజనం కలుగుతుందని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

మహిళల ఆరోగ్యంతోనే సమాజానికి ప్రయోజనం
X

మహిళల ఆరోగ్యంతోనే సమాజానికి ప్రయోజనం

జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ క్యాంప్ లు

స్వస్థనారీ అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న మహిళ

జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్

దోమకొండ మెగా హెల్త్ క్యాంపులో 124 మంది మహిళలకు పరీక్షలు

దిశ దోమకొండ: మహిళల ఆరోగ్యం పై దృష్టి పెడితేనే సమాజానికి ప్రయోజనం కలుగుతుందని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు ఆయన స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దోమకొండ లో జరిగిన మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వస్థనారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అందుకోసమే ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు. మహిళల కోసం స్పెషల్ గా ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు ఇవాళ ప్రారంభమై వచ్చే నెల రెండవ తేదీ వరకు జిల్లాలో ఉన్న 20 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు రెండు ప్రాథమిక పట్టణ వైద్య కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో పాటు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులతోపాటు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక డాక్టర్లతో నిర్వహిస్తున్న ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ శిబిరంలో 124 మంది మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ ప్రభు కిరణ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శిరీష, రాధిక, అనురాధ, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ విజయలక్ష్మి, దోమకొండ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story