- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నదీ స్నానాలతో చర్మ రోగాలు తగ్గుతాయి
నదీ స్నానాలు చేయడం వల్ల మనుషులకు చర్మ రోగాలు తగ్గి ఆయురారోగ్యాలు కలుగుతాయని అచ్చంపేట రామాలయం పురోహితులు, వేద బ్రాహ్మణోత్తముడు సంజీవ్ రావు శర్మ అన్నారు.

దిశ, నిజాంసాగర్ : నదీ స్నానాలు చేయడం వల్ల మనుషులకు చర్మ రోగాలు తగ్గి ఆయురారోగ్యాలు కలుగుతాయని అచ్చంపేట రామాలయం పురోహితులు, వేద బ్రాహ్మణోత్తముడు సంజీవ్ రావు శర్మ అన్నారు. మాఘ అమావాస్య సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామం మంజీరా నది ఒడ్డున నాగమడుగు ప్రాంతంలో ఆదివారం వందలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, బీదర్, బోధన్ సుధీర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా సంజీవ్ రావు శర్మ మంజీరా నది వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నది స్నానాల వల్ల చెట్ల ఔషధ తత్వం వల్ల చర్మ రోగాలు రాకుండా, ఆయురారోగ్యాలు కలిగే విధంగా ఉంటాయని పురోహితులు తెలియజేశారు. చర్మవ్యాధులు రావని భక్తు కూడా విశ్వాసం. అక్కడ ఉన్నటువంటి శివలింగానికి, నాగసర్పానికి పూజలు నిర్వహించుకుంటారు. గత కాలంలో పక్కనే గల ఒక అడవి ప్రాంతంలో విపరీతమైన మంటలు ఏర్పడడం వల్ల అందులో ఉన్న ఒక పెద్ద నాగసర్పము ఆ మంటలను తట్టుకోలేక ఈ నదీ పరివాహక ప్రాంతమైన నాగమడుగులో గుప్తమైనట్టు చెబుతుంటారు. అందుకే ఈ ప్రాంతానికి నాగమడుగు అని పేరు వచ్చిందని పురోహితులు తెలిపారు. మాఘ అమావాస్య సందర్భంగా నాగమడుగు వద్దకు పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులకు అచ్చంపేట గ్రామ ప్రజలు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య, ఉప సర్పంచ్ రవీందర్, గ్రామ పెద్దలు చాకలి విఠల్, చాకలి రమేష్, మ్యాదరి సాయిలు, సంకు ప్రసాద్, మంగలి ఎల్లయ్య, బొడ్డు అంజయ్య, ఎర్రోళ్ల సాయిలు, గుల రాజు పాల్గొన్నారు.






