పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురు అరెస్ట్..

by Kodari Anjali |

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురు అరెస్ట్..
X

దిశ, సదాశివ నగర్: సదాశివ నగర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడేగాం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న పక్క సమాచారంతో ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో సిబ్బందితో దాడి నిర్వహించారు. సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజు విశ్వాసనీయ సమాచారం మేరకు పేకాట ఆడుతున్న పక్క సమాచారంతో దాడి చేశామన్నారు. మూడు ముక్కలాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ 35,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించికేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతుందని ఎస్ఐ పుష్ప రాజ్ తెలిపారు.

Next Story