హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్ట్

by Bhanu |

ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో రొయ్యల సురేష్ పై తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఆరుగురినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విక్రమ్ శుక్రవారం తెలిపారు.

హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్ట్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో రొయ్యల సురేష్ పై తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఆరుగురినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విక్రమ్ శుక్రవారం తెలిపారు. సురేష్ పై రాడ్లతో దాడి చేసి బైక్ ఎక్కించి కాలును విరగొట్టిన వ్యక్తులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇటీవల రాత్రి 9 గంటల ప్రాంతంలో మోర్తాడ్ గ్రామానికి చెందిన రొయ్యల సురేష్ పని ముగించుకుని మసీద్ దారి నుండి కారులో ఇంటికి వెళుతున్నాడు.

మార్గమధ్యలో కిరాణా షాప్ వద్ద రోడ్డుపై అడ్డంగా ఉన్న బైకును తీయాలని మహమ్మద్ షాహాభాజ్, అబ్దుల్ మజార్ లను కోరాడు. అడ్డంగా ఉన్న బైకు తీసేది లేదని బూతు మాటలు తిట్టి సురేష్ పై వారిద్దరు కలిసి బైకును ఎత్తివేశారు. అదే సమయంలో తమ వెంట ఉన్న రాడుతో తలపై బాదారు. నిందితులైన షాహాబాజ్, అబ్దుల్ మజర్ లకు మద్దతునిస్తూ సురేష్ పై దాడి చేసిన మహమ్మద్ అస్లం, అబ్దుల్ మాలిక్, అబ్దుల్ అర్బస్, మహమ్మద్ ఫయస్ లను బిఎన్ఎస్ 109, 292, ఆర్ డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు చెప్పారు.

Next Story