పసిడి పైపైకి..బంగారంతో పోటీ పడుతున్న వెండి ధరలు

by velandi.Saikiran |   (  Updated:2026-01-22 01:52:50  IST  )

మార్కెట్లలో పసిడి, వెండి ధరలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. పెట్టుబడిదారుల సురక్షిత స్వర్గధామంగా భావించే ఈ విలువైన లోహాలు ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నాయి.

పసిడి పైపైకి..బంగారంతో పోటీ పడుతున్న వెండి ధరలు
X

మార్కెట్లలో పసిడి, వెండి ధరలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. పెట్టుబడిదారుల సురక్షిత స్వర్గధామంగా భావించే ఈ విలువైన లోహాలు ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న వేగం చూస్తుంటే, పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. పె­ళ్లి­ళ్ల సీ­జ­న్ ప్రా­రం­భం కా­వ­డం­తో దే­శీ­యం­గా డి­మాం­డ్ మరింత పె­రి­గే అవ­కా­శం ఉంది. ఇది సా­మా­న్య మధ్య­త­ర­గ­తి ప్ర­జ­ల­కు భా­రం­గా మా­ర­నుం­ది. స్టా­క్ మా­ర్కె­ట్ల­లో ఒడి­దు­డు­కు­లు ఉన్న­ప్ప­టి­కీ, పసి­డి మా­త్రం స్థి­ర­మైన లా­భా­ల­ను అం­ది­స్తుం­డ­టం­తో సా­మా­న్యుల నుం­చి సం­ప­న్నుల వరకు అం­ద­రూ డి­జి­ట­ల్ గో­ల్డ్ మరి­యు గో­ల్డ్ ఈటీ­ఎ­ఫ్‌ల వైపు మొ­గ్గు చూ­పు­తు­న్నా­రు. సామాన్యూలకు పెరిగిన బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడి పెరుగుతున్నాయి. వెండి ధర మార్కెట్ లో మునుపెన్నడూ లేనివిధంగా నమోదైంది.

దిశ, భిక్కనూరు : ఎవరు ఊహించని విధంగా పసిడి ధరలు ఏ విధంగా పై పైకి పోయాయో.... అదే దారిలో వెండి ధరలు వెళుతుండడం సామాన్య పేద ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పెళ్లిళ్లు పేరంటాలకు గ్రామ బంగారం కొనాలన్న, తక్కువలో తక్కువ పది నుంచి ఇరవై తులాల వెండి కొనాలన్న, కొనలేని పరిస్థితి ముఖ్యంగా పేద సామాన్యుల వంతయ్యింది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏమైనా తగ్గుతుందేమోనన్న ఆశతో ఉన్న కొనుగోలుదారులకు ఒకటి రెండుసార్లు బాగా తగ్గినట్టే తగ్గి, ఒక్కసారిగా అంతకు రెండింతలు పెరిగిపోయాయి. మళ్లీ ఏమైనా తగ్గుతుందేమోనన్న ఆశతో ఉన్న సామాన్యులు, పేదలకు రోజురోజుకు మరింత పెరిగిపోతున్న పుత్తడి ధరలను చూసి షాక్ అవుతున్నారు. తాజాగా గంట గంటకు పెరుగుతున్న ధరలను చూసి అయోమయానికి గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సంక్షోభం వలన ఈ విధంగా ధరలు పెరిగిపోతున్నాయని, ఈ ప్రభావం మరెన్ని రోజులు ఉంటుందనేది ఎవరికి అంతు చిక్కడం లేదని బంగారం వెండి వర్తకులు అభిప్రాయపడుతున్నారు. తులం బంగారం ధర అప్పట్లో లక్ష రూపాయలు దాటినప్పుడు... మళ్లీ దిగి రాకపోతుందా అన్న నమ్మకంతో ఉన్న కొనుగోలుదారులకు దిగొచ్చుడెమో కాని, పెరిగిపోతుండడం తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. ప్రస్తుతం లక్షా 59 వేలకు ఆల్ టైం రికార్డ్ దాటిన తులం బంగారం ధర తొందర్లోనే 2 లక్షల వరకు వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

మాసమైన కొనలేని పరిస్థితి....

అప్పుడో ఇప్పుడో పోగు చేసుకున్న డబ్బులతో పావు, అర్ధ, తులం బంగారం కొనుగోలు చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఇంటి ఖర్చులను పొదుపుగా ఖర్చు చేస్తూ... ఎంతో కొంత మిగిలిన డబ్బుల ను పక్కకు వేసి, కొన్ని రోజుల తర్వాత వాటిని బయటకు తీసి లెక్కించేవారు. ఆ విధంగా పోగైన డబ్బుతో వెండి వస్తువులు గాని, బంగారం గాని కొనుగోలు చేసే వారు. ఆ రకంగా జమ చేసిన పసిడితో ఆడవారు తమకు అవసరమైన నగను చేయించుకునేవారు. అంతేకాకుండా ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్ల కు పోగు చేసి ఉంచిన బంగారం, వెండి తో అవసరమైన వస్తువులు చేయించి కుటుంబ సభ్యులకు మనవలు మనవరాళ్లకు కానుకగా పెట్టేవారు.ఇప్పుడు ఆ విధంగా డబ్బులు పోగేసినా గ్రామ్ కాదు కదా, మాసమెత్తు బంగారం, ఓ 10 తులాల వెండి వస్తువులు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో పిల్లల పెళ్లిళ్లకు బంగారం వెండి వస్తువులు ఎట్లా పెట్టేది అన్న టెన్షన్ పట్టుకుంది. కొందరైతే ఆ విధంగా పెరిగిపోతున్న ధరలను చూసి, వారి వద్ద నిల్వ ఉన్న బంగారు ఆభరణాలను చూసి జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలన్న ముందు చూపుతో ఆలోచిస్తున్నారు.

ఐదు రోజుల్లో 14 వేలకు పైగా పెరిగిన ధర...

ఐదు రోజుల క్రితం తులం బంగారం ధర లక్షా 45వేల రూపాయలు పలుకగా ఇవాళ 11 వేల రూపాయలకు పైగా పెరిగిపోయి లక్షా 48 వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర కూడా 3 లక్షల40 వేల రూపాయలకు పెరిగిపోవడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక బంగారు వెండి చూసి మురవాల్సింది తప్ప కొనలేని పరిస్థితి వచ్చిందంటూ పెదవిరిస్తున్నారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు తయారు చేసేవారు ఆ రోజుకు ఉన్న ధరకు అనుగుణంగా అడ్వాన్స్ తీసుకున్న వారు సైతం, పెద్ద మొత్తంలో నష్టపోయే పరిస్థితి తలెత్తుతుండడంతో లబోదిబోమంటున్నారు.

అనిచ్చితి వల్లే ఈపరిస్థితి....

ఎమ్మెస్ పాండురంగ చారి....

గోల్డ్ స్మిత్ భిక్కనూరు

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్లే బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం ఏమాత్రం లేదన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరల వలన, నగలు చేయించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దుకాణాలను బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

కూతుళ్ళ పెళ్లిళ్లు ఎట్లా చేసేది...

నాగర్తిలయ రాంరెడ్డి( గృహిణి)*రామేశ్వర్ పల్లి

బంగారం వెండి ధరలు ఈ విధంగా పెరిగిపోతుంటే కూతుళ్ళ పెళ్లిళ్లు ఎట్లా చేసేదన్నారు. ఓ పక్క భూముల కు ధరలు లేక ఇబ్బంది పడుతుంటే, బంగారం ధరలు అందనంత దూరంలో వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు.

Next Story