ఆర్మూర్ లో షార్ట్ సర్క్యూట్..గగ్గోలు పెడుతున్న బాధితులు

by Naveena |

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ పంప్ ప్రక్కన 5 దుకాణ సముదాయాలకు షార్ట్ సర్క్యూట్ సంభవించింది.

ఆర్మూర్ లో షార్ట్ సర్క్యూట్..గగ్గోలు పెడుతున్న బాధితులు
X

దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ పంప్ ప్రక్కన 5 దుకాణ సముదాయాలకు షార్ట్ సర్క్యూట్ సంభవించింది. జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఐదు దుకాణ సముదాయాల్లో కిరాణా షాప్, హోటల్, ఆటోమొబైల్ షాపులను పలువురు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ దుకాణ సముదాయాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదు దుకాణాలు అగ్నికి దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత దుకాణ యజమానులు గగ్గోలు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా.. మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకొని ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు సేకరిస్తామని అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు. సంబంధిత దుకాణదారులు ఉపాధి కోసం దుకాణాలు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఉదయం వేళలో షార్ట్ సర్క్యూట్ జరిగి తీవ్రంగా నష్టపోయామని బాధిత దుకాణాదారులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని సంబంధిత దుకాణాదారులు మొరపెట్టుకున్నారు.

Next Story