- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కేసు తీవ్ర విషాదాన్ని నింపింది.

కామారెడ్డిలో విషాదం
- అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతి
- కన్న తండ్రే హత్య చేసినట్లు అనుమానాలు..
-పోలీసుల అదుపులో కన్న తండ్రి
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కేసు తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు కామారెడ్డి పెద్దచెరువులో రాత్రి 9గంటల తర్వాత విగతా జీవులుగా లభ్యం కావడంతో విషాదం నెలకొన్నది. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌బీనగర్ కాలనీకి చెందిన సీపత్ (8), ఆయాత్ (7), మరియం (5) అనే ముగ్గురు చిన్నారులు అదృశ్యమైనట్లు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, విచారణ జరిపిన పోలీసులకు కామారెడ్డి పెద్దచెరువులో ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆయాత్, మరియం మృతదేహాలు లభ్యం కాగా సీపత్ మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా, కన్న తండ్రే ఆ చిన్నారులని చంపి చెరువులో మృతదేహాలను పడేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, తల్లి పలువురి ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటుండగా తండ్రి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. అయితే తండ్రికి అప్పుడప్పుడు మతిమరుపు ఉంటుందని తల్లి పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.
కామారెడ్డిలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారుల అదృశ్యం
దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో శనివారం వేర్వేరు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు మిస్సింగ్ అయ్యారు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన బావ బామ్మర్దులు సింహాద్రి, విజయ్ అనే ఇద్దరు చిన్నారులు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపాత్, ఆయాత్, మరియం శనివారం ఉదయం ఆటోడ్రైవర్ అయిన తన తండ్రితో కలిసి ఆటోలో ఓ షాప్ వద్దకు వెళ్లారు. షాప్ వద్ద తినుబండారాలను కొనుక్కున్నారు. అనంతరం తామే తిరిగి ఇంటికి వెళ్తామని తండ్రితో చెప్పడంతో ఆయన ఆటోతో పాత బస్టాండ్ వైపు వెళ్లాడు. రెండు గంటల అనంతరం తల్లి తన భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఇంటికి రాలేదని తెలిపింది. దీంతో షాపు వద్ద వదిలేసి వెళ్లానని ఆయన చెప్పారు. సాయంత్రం అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థలానికి కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ చేరుకొని మూడు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరికైనా అదృశ్యమైన పిల్లల అచూకీ తెలిస్తే వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.






