లోకల్ వాహనదారులకు షాక్.. టోల్ ఛార్జిలు వ‌సూల్..!

by Nallavelli.Anjaneyulu |

లోకల్ వాహనాలకు టోల్ ఛార్జిలు మిన‌హాయింపు ఇచ్చిన టోల్ ప్లాజా యాజమాన్యం, మళ్లీ టోల్ వసూల్ చేస్తుండటం ప‌ట్ల‌ వాహనదారులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

లోకల్ వాహనదారులకు షాక్.. టోల్ ఛార్జిలు వ‌సూల్..!
X

దిశ, భిక్కనూరు : లోకల్ వాహనాలకు టోల్ ఛార్జిలు మిన‌హాయింపు ఇచ్చిన టోల్ ప్లాజా యాజమాన్యం, మళ్లీ టోల్ వసూల్ చేస్తుండటం ప‌ట్ల‌ వాహనదారులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు 44వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద శనివారం రామేశ్వర్ పల్లి, తిప్పాపూర్ గ్రామాలకు చెందిన లోకల్ వాహనదారులు టోల్ బూతుల గుండా వ్యక్తిగత పనుల కోసం కామారెడ్డి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి వస్తూ.. టోల్ బూతుల గుండా వచ్చారు. ఎగ్జంషన్ పేరుతో గేటు ఓపెన్ కాగా.. కొద్దిసేపటి తరువాత ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కట్ అయినట్లు మొబైల్ ఫోన్ లకు మెసేజ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వాహనాలతో వెనకకు వచ్చి, ఎగ్జంషన్ ఉన్న వాహనాలకు టోల్ ఎలా కట్ చేస్తారంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

టోటల్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నామని.. అందుకే డబ్బులు కట్ అయ్యాయని, మళ్లీ వచ్చినప్పుడు డబ్బులు కట్ కాకుండా చూస్తామని, వాగ్వాదానికి దిగిన వాహనదారులను అప్పటి మందం బుజ్జగించి పంపించారు. అంతంపల్లికి చెందిన మరొక వాహనదారుడి కి టోల్ పడడంతో సదర్ వాహనదారుడు సైతం ప్లాజా సిబ్బందితో గొడవకు దిగాడు. మిన‌హాయింపు ఉన్న వాహనం కాకుండా, వేరే వాహనంతో వచ్చి మిన‌హాయింపు ఇవ్వాలని అడిగితే ఎలా అంటూ సిబ్బంది వాహనదారుడిని సముదాయిస్తూ ప్రశ్నించారు. వాహనానికి సంబంధించి ఆర్సీ బుక్కును తీసుకొని వస్తే ఫాస్టాగులో నమోదు చేసేవాళ్ళమని అప్పుడు టోల్ మినహాయింపు వర్తించేదన్నారు. పర్మినెంట్ టోల్ ప్లాజా నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతున్న ప్లాజాకు 500 మీటర్ల దూరంలో నిర్మాణ పనులు జరుగుతుండగా.. దాన్ని దృష్టిలో ఉంచుకొని, లోకల్ వాహనాలకు సైతం ఇక మీదట ఎగ్జంషన్ ఉండదనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసేందుకే, ఈ విధంగా ప్లాజా సిబ్బంది టోల్ తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Next Story