ఆప‌ద‌ సమయంలో అతివలకు అండ షీ టీమ్ : సీపీ సాయి చైతన్య

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆపద సమయంలో అతివలకు నిజామాబాదు షీ టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ చక్కని

ఆప‌ద‌ సమయంలో అతివలకు అండ షీ టీమ్ : సీపీ సాయి చైతన్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆపద సమయంలో అతివలకు నిజామాబాదు షీ టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ చక్కని సేవలందిస్తోందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య అన్నారు. జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణకై నిజామాబాద్ జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ప్రజల రక్షణకై విధులను నిర్వర్తిస్తుందని సీపీ తెలిపారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాల్లో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో పోకిరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఈ నెలలో 19 కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. షీ టీమ్ బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ షీ టీం బృందాలు యువతులకు, విద్యార్థినీ విద్యార్థులకు, పని స్థలాల్లో మహిళలకు ప్రత్యేకంగా 26 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరచడం జరుగుతోందన్నారు. సెప్టెంబర్ నెలలో షీ టీం బృందాల ద్వారా 11 ఈ పెట్టి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

షీ టీమ్ బృందాలు గత నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా 80 హాట్ స్పాట్లలో తనిఖీ చేయడం జరిగిందని.. పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన‌ట్టు సీపీ తెలిపారు. షీ టీమ్‌ బృందం సభ్యులు చాకచక్యంగా వ్యవహరిస్తూ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక బృందంచే మహిళలకు రక్షణగా నిలిచారన్నారు. మహిళలు వేధింపులకు గురికాకుండా అడ్డుపడుతూ ఆకతాయిల పట్ల చట్టపరంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కౌన్సిలింగ్ ల ద్వారా వివిధ కేసులలో ఏడుగురికి పరిష్కారం చూపినట్లు సీపీ తెలిపారు. ఆపత్కాల సమయంలో నిజామాబాద్ షీ టీం బృందాలను సంప్రదించాలంటే 8712659795 నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. 26 గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి మహిళల పట్ల జరిగే నేరాలపై, చైల్డ్ మ్యారేజ్, సైబర్ నేరాలపై , సోషల్ మీడియా నేరాలపై , చిన్నారులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై అవగాహనలు కల్పించి చైతన్యపరచడం జరిగిందని తెలిపారు. ఈ నెలలో మహిళల తమ తమ సమస్యలతో దాదాపు 7 గురు ఫోన్ లో కంప్లయింట్ చేశారన్నారు. మొబైల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి సమస్యకు తగిన పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. షీ టీమ్‌ బృంద సభ్యులు మహిళా ఆర్ఎస్ఐ స్రవంతి, హెడ్ కానిస్టేబుళ్లు సుమతి , ఆశయ్య , కానిస్టేబుల్ విఘ్నేష్, శ్రీకాంత్ , నాగరాజు, రేఖా రాణి, హరిత రాణి, రాధిక మరియు మహిళా సిబ్బంది షీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story