- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాభివృద్ధిలో కార్మికుల సేవలు అమూల్యమైనవి : కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి
గ్రామ పరిశుభ్రత కోసం నిత్యం కష్టపడుతున్న కార్మికుల సేవలు అమూల్యమైనవని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.

దిశ, నిజాంసాగర్ : గ్రామ పరిశుభ్రత కోసం నిత్యం కష్టపడుతున్న కార్మికుల సేవలు అమూల్యమైనవని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కారోబార్ సాయిలు, ట్రాక్టర్ డ్రైవర్ సాయిలు, సఫాయి సాయిలు వంటి పంచాయతీ సిబ్బందిని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, పరిశుభ్రతలో పంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, గ్రామ పరిశుభ్రత కోసం నిత్యం కష్టపడుతున్న కార్మికుల సేవలు అమూల్యమైనవని అన్నారు. వారి కృషిని గుర్తించి సన్మానించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ కుమ్మరి రాములు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే పంచాయతీ సిబ్బంది కృషి ఎంతో అవసరమని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. వారి సేవలను గుర్తించి సత్కరించడం గర్వకారణమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్య నాయక్, మండల బంజారా సంఘం అధ్యక్షులు గోపి సింగ్, గ్రామ అధ్యక్షులు కమ్మరి కృష్ణ, రషీద్ పటేల్, లింగాల అంజన్న పటేల్, నర్సింలు పటేల్, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.






