మ‌న‌స్థాపం చెంది వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

by Nallavelli.Anjaneyulu |

బతకాలని లేదు.. నాకు చావే శరణ్యం.. వదలండి అంటూ ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ కు యత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

మ‌న‌స్థాపం చెంది వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
X

దిశ, భిక్కనూరు : బతకాలని లేదు.. నాకు చావే శరణ్యం.. వదలండి అంటూ ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ కు యత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్ర‌కారం.. రాజంపేట మండల కేంద్రానికి చెందిన వెంకటేష్ గౌడ్ టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్ లు ఆడుతూ అప్పుల పాలయ్యాడు. సుమారు మూడు లక్షల రూపాయల వరకు అప్పులు పెరిగిపోవడం, అవి ఎట్లా తీర్చే దంటూ లో లోపల కుమిలిపోవడం, ముగ్గురు పిల్లల్ని కుటుంబాన్ని ఎట్లా పోషించేదంటూ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మందు బాటిల్ ను వెంటబెట్టుకొని గ్రామం నుంచి బైక్ పై బయలుదేరాడు. గ్రామంలోని తల మడ్ల వెళ్లే రోడ్డులో ఉన్న పెద్ద చెరువు వద్దకు రాగానే బైక్ ను పక్కన పార్క్ చేసి, చెట్టు కింద కూర్చొని వెంట తెచ్చుకున్న మందు తాగాడు. తాగుడు పూర్తయ్యాక చెరువులో కి దూకాడు. దారిన వెళ్తున్న వారితోపాటు, కొందరు గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి వారు ఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆఫ్ట్రాల్ 3 లక్షల రూపాయల కోసం ముగ్గురు పిల్లలు భార్యను వదిలి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా అంటూ మందలించారు. అప్పటికే ఈ విషయాన్ని గ్రామస్తులు 100 నెంబర్ కు డయల్ చేయడంతో పాటు వారి స్నేహితులకు సమాచారం అందించడంతో, పోలీసులు, అంబులెన్స్, స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న అప్పుకే ఆత్మహత్య చేసుకుంటావా అంటూ ఎలాగైనా ఈ అప్పు తీర్చవచ్చని నచ్చ జెప్పారు. నాకు బతకాలని లేదు. చావనివ్వండి అంటూ మొండికేయగా అందరూ కలసి సముదాయించడంతో శాంతించాడు. వచ్చిన స్నేహితులు బైక్ పై ఎక్కించుకొని అటెంప్ట్ చేసుకున్న వ్యక్తిని బైక్ పై ఎక్కించుకుపోవడంతో కథ సుఖాంతం అయింది.

Next Story