- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్ల పట్టివేత
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్ లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు.

దిశ, నిజాంసాగర్ : ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్ లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. నిజాంసాగర్ మండల మండలంలోని అచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ మూడు ట్రాక్టర్ ల ద్వారా గ్రామ శివారులో గల మంజీరా నుండి ఎలాంటి ప్రభుత్వం అనుమతులు తీసుకోకుండా మర్పల్లి నుంచి సంగారెడ్డి జిల్లా మాసన్ పల్లి వైపు జాతీయ రహదారి161 రోడ్డు వద్ద ట్రాక్టర్లను తనిఖీ చేయగా యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా తన ట్రాక్టర్ లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని మూడు ట్రాక్టర్లను, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేనిదే ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సైతం జప్తు చేసుకుంటామని ఎస్ఐ వెల్లడించారు.






