220 గ్రాముల నిషేధిత అల్పజోలం పట్టివేత

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లాలో ముగ్గురి వద్ద అక్రమంగా కలిగి ఉన్న 220 గ్రాముల నిషేధిత అల్పజోలం ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

220 గ్రాముల నిషేధిత అల్పజోలం పట్టివేత
X

దిశ, కామారెడ్డి, సదాశివ నగర్ : కామారెడ్డి జిల్లాలో ముగ్గురి వద్ద అక్రమంగా కలిగి ఉన్న 220 గ్రాముల నిషేధిత అల్పజోలం ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో గడిపల్లి శ్రీకాంత్ గౌడ్ వద్ద నాలుగు గ్రాముల అల్పజోలంను పట్టుకున్నారు. ఈ సందర్భంగా అతడినీ విచారించగా.. నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన ఇగురం రాజేందర్ గౌడ్ వద్ద 110 గ్రాముల అల్ఫాజోలం, జలాల్పూర్ కు చెందిన గడ్డం మాణిక్య గౌడ్ వద్ద 106 గ్రాముల అల్పజోలం లభ్యమైంది. ఈ సందర్భంగా ఈ ముగ్గురిపై ఎన్డిపీఎస్ చట్టం కింద కేసును నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్టు ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, టాస్క్ ఫోర్స్ సీఐ సుందల్ సింగ్ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై లు విక్రమ్, శరత్ కుమార్, సిబ్బంది మారుతి, అభిషేక్, ఆమోస్, సిద్ధిరాములు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీరాగ, రమ, అపూర్వ పాల్గొన్నారు.

Next Story