మధ్యాహ్న భోజనంలో పురుగులు దర్శనం

by Nallavelli.Anjaneyulu |

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలోని గురుకుల పాఠశాలను మంగళవారం నిజాంసాగర్ మండల ప్రత్యేకాధికారి ప్రమీల, జోనల్ అధికారి పూర్ణచందర్ తనిఖీ చేశారు. ఈనెల10న నిజాంసాగర్ ఎం

మధ్యాహ్న భోజనంలో పురుగులు దర్శనం
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలోని గురుకుల పాఠశాలను మంగళవారం నిజాంసాగర్ మండల ప్రత్యేకాధికారి ప్రమీల, జోనల్ అధికారి పూర్ణచందర్ తనిఖీ చేశారు. ఈనెల10న నిజాంసాగర్ ఎంపీడీవో శివకృష్ణ, ఎంఈవో తిరుపతిరెడ్డిలు తనిఖీ చేసిన సమయంలో మెను పాటించడం లేదని, కంపు కొడుతున్న మూత్రశాలలతో పాటు పలు సమస్యలు వారి దృష్టికి రావడంతో వారు ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి నివేధిక అందించాలని తెలపడంతో మండల ప్రత్యేకాధికారి పాఠశాలను తనిఖీ చేసారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. తనిఖీ సమయంలోనే అన్నంలో నల్లటి పురుగులు దర్శనమివ్వడంతో బియ్యంలో లక్క పురుగులు ఉన్నాయని సిబ్బంది తెలిపారు. వాటిని శుభ్రం చేయాలని సూచించారు. గురుకుల పాఠశాలలోని పరిస్థితిని నివేదిక తయారు చేసి కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు. వారి వెంట ఎంపీడీవో శివకృష్ణ, ఎంఈఓ తిరుపతిరెడ్డి, ఎంపీఓ అనిత రెడ్డి, బాన్సువాడ సూపర్వైజర్ సౌభాగ్య ఉన్నారు.

Next Story