ఇద్దరు ఏఎస్పీలు, డీఎస్పీలు, ఏడుగురు సీఐలతో బందోబస్తు

by Batti.Sumithra |

ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ స్థలం వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ తెలిపారు.

ఇద్దరు ఏఎస్పీలు, డీఎస్పీలు, ఏడుగురు సీఐలతో బందోబస్తు
X

దిశ, భిక్కనూరు : ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ స్థలం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు.

ఇవాళ ఆమె భిక్కనూరు శివారులోని ఫ్యూజన్ ఫార్మా హెల్త్ కేర్ వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు ఏఎస్పీలు, డిఎస్పీలు, జిల్లాకు చెందిన ఏడుగురు సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు కేవలం ఫార్మా కంపెనీ ఏర్పాటు పై ప్రజాభిప్రాయం మాత్రమే చెప్పాలని సూచించారు. ఆమె వెంట భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు ఉన్నారు.

Next Story