కోటార్ మూర్ లో అర్థ‌రాత్రి స్కూటీ ద‌గ్దం..!

by Ratna Kumari |

ఆర్మూర్ మున్సిప‌ల్ ప‌ట్ట‌ణ కేంద్రంలోని మున్సిప‌ల్ ఆరో వార్డు ప‌రిధిలో అన్న‌పూర్ణ కాల‌నీలో నివాస‌ముండే గ‌ట్ట‌డి స్నేహ‌కు చెందిన స్కూటీ శుక్ర‌వారం ద‌గ్ధం అయింది.

కోటార్ మూర్ లో అర్థ‌రాత్రి స్కూటీ ద‌గ్దం..!
X

దిశ‌, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిప‌ల్ ప‌ట్ట‌ణ కేంద్రంలోని మున్సిప‌ల్ ఆరో వార్డు ప‌రిధిలో అన్న‌పూర్ణ కాల‌నీలో నివాస‌ముండే గ‌ట్ట‌డి స్నేహ‌కు చెందిన స్కూటీ శుక్ర‌వారం ద‌గ్ధం అయింది. అన్న‌పూర్ణ కాల‌నీకి చెందిన స్నేహ వారి ఇంటి ముందు శుక్ర‌వారం రాత్రి ఆమెకు చెందిన టీఎస్ 16డీ 0965 నెంబ‌ర్ గ‌ల స్కూటీ ఉంచి ప‌డుకుంది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌మ స్కూటీ వాహ‌నానికి నిప్పు అంటించి ఉంటార‌ని స్నేహ కుటింబీకులు వాపోయారు. రాత్రి వేళ‌లో గ‌స్తీని పెంచి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని వారు పోలీసుల‌ను కోరారు. అదేకాల‌నీలో మ‌హిళ‌ల‌కు సంబంధించి ఫ్యాన్సీ స్టోర్ ను నిర్వ‌హ‌ణ చేస్తూ గ‌ట్ట‌డి స్నేహ ఉపాధి పొందుతున్న‌ట్టు తెలిపారు.

Next Story