- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లారెడ్డి అభివృద్ధికి సర్పంచ్ లు నడుం బిగించాలి : ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలు పునర్నిర్మాణమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు.

దిశ, తాడ్వాయి(లింగంపేట) : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలు పునర్నిర్మాణమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి నూతన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా నిర్వహించారు. 176 గ్రామాల నుంచి దాదాపు 5000 మందికి పైగా హాజరై ఎమ్మెల్యే మదన్ మోహన్ కి గజామాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ.. సర్పంచులు తమ విధుల్లో పూర్తి స్వేచ్ఛతో పని చేయాలని, ముఖ్యంగా మహిళా సర్పంచుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు,డ్రైనేజీలు, వీధి దీపాలు,తాగునీరు వంటి కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు.ప్రతి పంచాయతీ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని,నెలలో రెండుసార్లు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యా ప్రమాణాలను పర్యవేక్షించాలని సూచించారు.
సీఎం కి కానుక ఇవ్వాలి..
నియోజకవర్గంలోని 209 గ్రామ పంచాయతీల్లో 176 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు.46 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కావడం ఒక రికార్డు అని కొనియాడారు. ఇదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయం సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే డిసిప్లిన్.. డిసిప్లిన్ అంటే కాంగ్రెస్ కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది. పార్టీకి వెన్నుపోటు పొడిచే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే తన ఆశయమని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






