- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురికి కాలువలు శుభ్రం చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్
భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో సర్పంచ్ చేపూరి రాణి, ఉప సర్పంచ్ గొల్లపల్లి వినోద్ గౌడ్ మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు

దిశ, భిక్కనూరు : గత కొద్ది సంవత్సరాలుగా మురికి కాల్వలలో పేరుకుపోయిన మురికిని సర్పంచ్, ఉప సర్పంచ్ కలసి పారిశుద్ధ్య కార్మికులతో కలసి మోర్లు తీసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మురికి కాల్వలలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, గ్రామ ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ గౌడ్ లు వార్డు సభ్యులతో కలసి పారిశుద్ధ్య కార్మికులతో మోర్లు శుభ్రం చేశారు. గ్రామానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దగ్గరుండి వారు చేస్తున్న పనులను పర్యవేక్షించారు. గ్రామంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మోర్లు తీయాలో సర్పంచ్ వార్డు సభ్యులతోపాటు పారిశుద్ధ్య కార్మికులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.






