పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేటలో జరుగుతున్న

పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
X

దిశ, కామారెడ్డి : వర్షాల కారణంగా కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేటలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల తీరును ఆయన పరిశీలించారు. మురుగు నీటి పారుదల, చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నీటి నిల్వలు లేకుండా చూడాలని, చెత్తను సమయానికి తరలించడంతో పాటు, శానిటేషన్ వర్కర్లు పర్యవేక్షణలో ఉండేలా చూడాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పారిశుద్ధ్యం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, అధికారులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యం పై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరు పరిశీలన

రాజంపేట‌లో ల‌బ్దిదారులు నిర్మించుకుంటున్న ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ ప‌నుల పురోగ‌తిని క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వంద శాతం మార్కౌట్ పనులు పూర్తి చేయాలని, బేస్ మెంట్, రూఫ్, స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పరిశీలిస్తూ లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం సరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారుడి ఇంటి నిర్మాణం భూమిపూజ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మదన్మోహన్, పి.డి. హౌసింగ్ జైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. రాజేందర్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్, ఆర్‌.ఐలు, వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Next Story