- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
దిశ, కామారెడ్డి : సమాచార హక్కు చట్టం 2005 ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ

దిశ, కామారెడ్డి : సమాచార హక్కు చట్టం 2005 ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్టిఐ 2005 వారోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ఆర్టిఐ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు సమాచార హక్కు చట్టం 2005 అవగాహన కార్యక్రమం నిర్వహించి ఆర్టిఐ చట్టం వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను, చట్టం అమలు తీరు, ఆర్టిఐ చట్టంలో ఉన్న అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీ తనం ను పెంపొందించేందుకు ఆర్.టి.ఐ చట్టం తీసుకు తీసుకువచ్చారని ఆర్టిఐ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చేలా అన్ని కార్యాలయాల పీఐఓ లు ప్రజలు అడిగిన సమాచారాన్ని ఎలాంటి దాపరికం లేకుండా నిర్ణీత సమయంలో నిర్ణీత పద్ధతిలో అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టిఐ చట్టం అమలును ఆర్టిఏ చట్టం మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అదనపు కలెక్టర్ కలెక్టర్ లోకల్ బాడీ చందర్ నాయక్, డిఆర్ఓ మధు మోహన్, ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ పాల్గొన్నారు.






