మొబైల్ షాపులో చోరి.. దొంగ అరెస్ట్

by Ratna Kumari |

మొబైల్ షాపు తాళాలు పగులగొట్టి చోరి కి పాల్పడ్డ దొంగను అరెస్ట్ అయిన ఘ‌ట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

మొబైల్ షాపులో చోరి.. దొంగ అరెస్ట్
X

దిశ, మాచారెడ్డి : మొబైల్ షాపు తాళాలు పగులగొట్టి చోరి కి పాల్పడ్డ దొంగను అరెస్ట్ అయిన ఘ‌ట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండలంలోని గజ్యానాయక్ తండా లో అంకిరెడ్డిపల్లి తాండ గ్రామానికి చెందిన గగ్లోత్ చందు కు చెందిన మొబైల్ షాప్ తాళాలు పగులగొట్టి మూడు మొబైల్ ఫోన్లు కొంత నగదు దోచుకెళ్లినట్ట బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. బుధవారం పోలీస్ స్టేషన్ ముందు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అజ్మీర అశోక్ బైక్ పై వస్తూ పోలీసులను చూసి పారిపోవాలని ప్రయత్నం చేయగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఫిర్యాదు దారుడికి చెందిన సెల్ఫోన్ షాప్ యొక్క షేటర్ తాళాలు పగలగొట్టి షాపు నుండి మూడు ఫోన్లు, కొంత నగదు దొంగిలించుకుని వెళుతున్నట్టు వెల్లడైంది. వెంటనే అతన్ని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచినట్టు ఎస్ఐ వివరించారు.

Next Story