- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఓబి పనులను త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ
దిశ, ఆర్మూర్ : జిల్లాలోని ఆర్ఓబి పనులను త్వరగా పూర్తి చేయాలని బిజెపి ఎమ్మెల్యేలు ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధ

దిశ, ఆర్మూర్ : జిల్లాలోని ఆర్ఓబి పనులను త్వరగా పూర్తి చేయాలని బిజెపి ఎమ్మెల్యేలు ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి లు డిమాండ్ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటన సందర్భంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన బిజెపి ఎమ్మెల్యేలను నాయకులకు జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు. నిజామాబాద్ జిల్లాలోని అడవి మామిడిపల్లి,మాధవ నగర్, అర్సపల్లి ఆర్ఓబి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని బిజెపి నాయకులు మండిపడ్డారు. ఈ సమయంలో బిజెపి నాయకులకు పోలీసులకు కొద్దిగా తోపులాట జరిగింది. జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు పోలీసులు అడ్డుకోవడంతో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందర బిజెపి ఎమ్మెల్యేలు, బిజెపి జిల్లా అధ్యక్షుడు, నాయకులు బైఠాయించి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు.






