- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధ్వానంగా రహదారులు.. మరమ్మతులకు నోచుకోని రోడ్లు
రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారులు సైతం దెబ్బతిని గోతులుగా మారినా పట్టించుకునే నాథుడే కరువ య్యారు.

దిశ, కమ్మర్ పల్లి : రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారులు సైతం దెబ్బతిని గోతులుగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీనికితోడు ఎత్తుపల్లాలుగా మారిన రోడ్లలో వాహనాలు అదు పుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్లు ఎత్తుపల్లాలుగా ఉండటంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకుపోయింది. ఈప్రమాదంలో కొందరు మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారి ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఆర్మూర్ నుంచి కమ్మర్ పల్లి జాతీయ రహదారి మీద నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఒకరు, ఇద్దరు మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని ఇదే పరిస్థితి నెలకొంది. కమ్మర్ పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్, భీమ్గల్ మండల పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. మురికి నీరు రోడ్డుపైకి చేరుకోవడంతో గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు కోట్లు రూపాయలు వ్యయంతో అధికారులు గ్రామాలలో రోడ్లు నిర్మించారు. నాణ్యత లోపమో.. నిర్వహణ నిర్లక్ష్యమో తెలియదు గానీ ప్రస్తుతం రోడ్లు అధ్వానంగా మారాయి. కొంతకాలానికే ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
మండలంలో రహదారి గుంతల మయమై అధ్వానంగా మారింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు గుంతల మయమై వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు మధ్య భాగంలో గుంతలు ఏర్పడి నీరు నిండి ఉండడంతో తెలియని వాహనదారులు గుంతలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ వద్ద జాతీయ రహదారి 63 పై పెద్ద పెద్ద గుంతలు పడడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం రోడ్డు గుంతల మయం కావడంతో అదుపుతప్పి ఒక వాహనం ఆటోని ఢీ కొట్టింది. ఉప్లూర్ నుంచి ఏర్గట్ల వెళ్లలేదా రహదారిలో ఉపూర్ గ్రామ శివారుల్లో శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ బ్రిడ్జి పైన అనునిత్యం ప్రమాదాలు చోటుచేసు కుంటుండడం గమనార్హం. ఏర్గట్ల మండ లానికి వైపు వెళ్లే ప్రధాన రహదారి. ఈ రహదారి గుండా రాజరాజేశ్వరనగర్, ఏర్గట్ల, తాళ్లరాంపూర్ పాటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, ఖానాపూర్, కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం, మెట్పల్లి తదితర గ్రామాలకు రోజువారి ప్రయాణాలు సాగిస్తారు. ప్రతీ శుక్రవారం పవిత్ర పుణ్యక్షేత్రాలు తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గంగాస్నానాలకు భక్తులు, రాకపోకలు సాగిస్తారు.
కాకతీయ కాలువపై గుంతలు ఉండడంతో వాహనాదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మండల కేంద్రం నుండి నాగపూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ వెళ్లే రహదారి, అమీర్ నగర్, కోనాపూర్, నర్సాపూర్ వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. ఏర్గట్ల మండలంలోని నాగేంద్ర నగర్ గ్రామం నుండి గుమ్మిర్యాల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా గుమ్మిర్యాల్ బస్టాండ్ సమీపంలో కొండాపూర్ క్రాస్ రోడ్డు వద్ద, ఏర్గట్ల నుండి ఇబ్రహీంపట్నం మండలానికి వెళ్లే రహదారి గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుమ్మిర్యల్ గ్రామ సమీపంలో మంగళవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడి పలువురు గాయపడ్డారు. భీంగల్ మండలం బాబా నగర్, బడా భీంగల్, భీంగల్ నుండి వేల్పూర్ మండలానికి వెళ్లే రహదారుల్లో గుంతలు పడటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారుల్లో ద్విచక్ర వాహనాలు ప్రయాణించే సమయంలో చక్రాలు సగం వరకు గుంతల్లో దిగిపోతుండటంతో అదుపు తప్పి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. వృద్ధులు, మహిళలు రహదారిపై ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మరమ్మత్తులు చేయాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారిని తక్షణం మరమ్మతులు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






