కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం : షబ్బీర్ అలీ

by Bhanu |   (  Updated:2025-05-02 15:19:43  IST  )

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం : షబ్బీర్ అలీ
X

దిశ, కామారెడ్డి : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు లక్ష్మీ కాంతారావు, మదన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఆగ్రో పరిశ్రమల రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా ఇన్చార్జ్ లు సత్యనారాయణ గౌడ్, వేణుగోపాల్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..ప్రజలు మనల్ని నాయకులుగా ఎన్నుకున్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతామని, పదవుల కోసం పాకులాడితే కుదరదన్నారు. ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ జిల్లాకు చేసిందేమీలేదని, ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలన్నారు.


నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు తాగు, సాగు నీరు అందాలని ప్యాకేజీ 21, 22, 23 ప్రాజెక్టు తీసుకువస్తే దానిని వారి స్వార్థాల కొరకు ఆపివేశారన్నారు. 300 కోట్లతో అయిపోయే పనిని 3000 కోట్లు పెట్టీ కాంట్రాక్టర్లకు ఇచ్చారనీ ఆరోపించారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని కోరారు. ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. యంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారని, ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైందని, వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులు గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story