దిశ క‌థ‌నానికి స్పంద‌న.. అక్ర‌మ దందాకు అడ్డుక‌ట్ట‌..!

by Ratna Kumari |

గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలో నిత్యం వంద‌లాది లారీలు, టిప్ప‌ర్లు నిమిషానికి ప‌ది లారీలు త‌రిస్తున్నారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న.. అక్ర‌మ దందాకు అడ్డుక‌ట్ట‌..!
X

దిశ‌, నందిపేట : గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలో నిత్యం వంద‌లాది లారీలు, టిప్ప‌ర్లు నిమిషానికి ప‌ది లారీలు త‌రిస్తున్నారు. ఎటు వైపు చూసిన నల్ల మట్టి తరలించే వాహనాలే దర్శనమిచ్చేవి. మితిమీరిన వేగంతో రోడ్లు ట్రాఫిక్ ను తలపించేవి. అధికార ప్రతిపక్ష పార్టీల అండ ఉన్న‌ద‌నే అహంకారంతో ఇష్టారాజ్యంగా నందిపేట మండలంలోని ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతం నుంచి నల్ల మట్టిని అడ్డగోలుగా తరలించిన అక్రమార్కుల ఆగడాలకు అధికారులు ఎట్టకేలకు ముక్కుతాడు వేశారు. పరిమితికి మించి నల్లమట్టిని తరలించరాదని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించడంతో నల్ల మట్టి వ్యాపారులు తోకముడిచారు.

మోసెంత బరువుతోనే ముందుకు

రాజకీయ అండ ఉందనే అహంకారంతో కొందరు ఇష్టారాజ్యంగా గోదావరి పరివాహకం నుంచి నల్ల మట్టిని తరలించారు. సహజంగానే దొరికే నల్ల మట్టిని వాహనాల్లో పట్టినంత ఎక్కించి పంపిద్దామని భావించారు. మొదట్లో నీటి పారుదల శాఖ అధికారులు అనుమతి ఇచ్చేందుకు ముందుకు రాకపోయినప్పటికీ రాజకీయ కారణాలతో స్థానికంగా ఉన్న అవసరాలతో మట్టి తరలింపున‌కు పర్మిషన్ ఇచ్చారు. ఓవర్ లోడ్ తో మట్టిని నిండుగా నింపి దూర ప్రాంతాలకు తరలించడంతో విమర్శలు వచ్చాయి. ఎక్కడ పడితే అక్కడ అధిక లోడుతో పోయే వాహనాలు ఇబ్బందులకు గురై నల్లబట్టిని అక్కడే రోడ్డుపై పారపోసి వదిలేశారు. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరికి గాయాలు కాగా.. మరికొందరు ప్రాణాలు విడిచారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలకు పూనుకున్నారు. ముఖ్యంగా మట్టిని తరలించే వాహనాల్లో పరిమితికి మించి ఎక్కించరాదని నిబంధనను కఠిన తరం చేశారు. దీంతో అక్రమార్కులు తోక ముడిచారు.

వేల నుంచి వందలకు..

ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతం నల్లమట్టి తరలించే వాహనాలతో నిత్యం జాతరను తలపించేది. రాత్రింబగళ్లు తేడా లేకుండా వందలాది వాహనాలతో వేలాది టిప్పులు కొడుతూ ఆ ప్రాంతం సందడిగా ఉండేది. అయితే అధికారులు ఓవర్ లోడ్ నిబంధన తీసుకురావడంతో వందలాది లో ఉన్న వాహనాలు పదుల సంఖ్యలోకి వచ్చాయి. కేవలం పేపర్ ప్లేట్ మాదిరిగా మట్టిని ఇప్పుడు తీసుకెళ్తున్నాయి.

దారులు మారుస్తూ దండుకుంటూ..

నందిపేట మండలం ఉమ్మెడ పరివాహక ప్రాంతం నుంచి వెళ్లే వాహనాలు ఇప్పుడు డొంకేశ్వర్ మండలం అన్నారం ప్రాంతం నుంచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు మట్టిని తరలించేందుకు చేస్తున్న అవినీతికి కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story