- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. అంగన్‌వాడి స్థలంలో అక్రమ నిర్మాణం తొలగింపు
దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ అంగన్‌వాడి స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణంపై జిల్లా అధికారులు ఆదేశించినా తొలగించని వైనం గురించి దిశ దినపత్రికలో సోమవారం ప్రచురించిన

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ అంగన్‌వాడి స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణంపై జిల్లా అధికారులు ఆదేశించినా తొలగించని వైనం గురించి దిశ దినపత్రికలో సోమవారం ప్రచురించిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. దీని ఫలితంగా అక్రమంగా నిర్మించిన గోడను తక్షణమే తొలగించారు. దిశ పత్రిక సోమవారం అంగన్ వాడి స్థలంలో అక్రమ నిర్మాణం.. జిల్లా అధికారులు ఆదేశించినా తొలగించని వైనం' అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి శివ కృష్ణ వెంటనే స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా నిర్మించిన గోడను సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివ కృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాల్లో ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్‌వాడి స్థలం సురక్షితం కావడానికి అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి కృషి చేసిన దిశ దినపత్రికకు గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారిని అనిత రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి రవి రాథోడ్, అంగన్ వాడి టీచర్ సుశీల ఉన్నారు.






