ఇజ్రాయిల్ ఐపాలో భారత సైనిక దళాలకు సంస్కరణ దినోత్సవం..

by Nallavelli.Anjaneyulu |

దిశ ఆర్మూర్ : ఇజ్రాయిల్ ఐపాలో ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం సంయుక్తంగా భారత సైనిక

ఇజ్రాయిల్ ఐపాలో భారత సైనిక దళాలకు సంస్కరణ దినోత్సవం..
X

దిశ ఆర్మూర్ : ఇజ్రాయిల్ ఐపాలో ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం సంయుక్తంగా భారత సైనిక దళాలకు సంస్కరణ దినోత్సవం నిర్వ‌హించారు. ఐఫా ను తిరుగుబాటు దారులు ఆక్ర‌మించిన స‌మ‌యంలో భార‌త సైనిక ద‌ళాలు వారిని ఢీ కొట్టి ఐఫా ప‌ట్ట‌ణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. శత్రు సైన్యంతో భారత సైనిక దళాలు జరిపిన పోరులో 900 పైచిలుకు సైనికులను కోల్పోవడంతోనే సంఘీభావంగా అప్పటి నుంచి అనాదిగా ఈరోజును సంస్కరణ దినోత్సవం గా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కెనడా, ఇజ్రాయిల్, భారత, యూఏఈ దేశాల ప్రతినిధులు పాల్గొని అప్పటి సైనిక పోరులో భారత సైనికుల త్యాగాలను స్మరించి, వారి పోరాటాన్ని కొనియాడారు. అనంతరం ఇండియన్ అంబాసి అధికారులతో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు బాణాల గంగాధర్ ఆ అధికారుల‌ను ప‌రిచ‌యం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ మాజీ చైర్మన్ బియాంక లక్ష్మీనారాయణ, ప్రస్తుత చైర్మన్ పస్కా సుధాకర్, మాజీ అధ్యక్షుడు సోమ రవి, ఇండియన్ హై కమిషనర్ జితేందర్ పాల్ సింగ్, డిప్యూటీ హై కమిషనర్ సర్వేజిక్ సుధన్‌ పాల్గొన్నారు.

Next Story