ఇల్లెందులో హడలెత్తిస్తున్న రెబల్స్

by velandi.Saikiran |

ఇల్లెందు మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను హడలెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

ఇల్లెందులో హడలెత్తిస్తున్న రెబల్స్
X

ఇల్లెందు మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను హడలెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టణంలోని 24వార్డుల్లో 65కు పైగా రెబల్స్ అభ్యర్థులు పోటీలో ఉండటం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. రెబల్ అభ్యర్థులను దారికి తెచ్చుకోవడానికి పార్టీ పెద్దలు ఫోన్ కాల్స్, రాయబారాలు, భవిష్యత్తులో పదవుల ఆశ చూపుతున్నప్పటికీ తగ్గేదేలే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గంలో పట్టున్న కీలక నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఓట్ల చీలికతో విజయావకాశాలు దెబ్బతింటాయనే భయం క్యాడర్‌లో కనిపిస్తోంది. ఇక బీఆర్ పార్టీలో సిట్టింగ్ అభ్యర్థికి వ్యతిరేకంగా కొందరు సీనియర్ నేతలు రెబల్‌గా మారడం పార్టీకి పెద్ద సవాలుగా మారింది. రెబల్స్ చీల్చే ఓట్లు ఏ పార్టీని ముంచుతాయో, ఏ పార్టీని గెలిపిస్తాయో అర్థం కాక కంగారు పడుతున్నారు. ఈ రెబల్స్ రూపంలో ఎదురుగాలి వీస్తుండటంతో ప్రధాన పార్టీల అగ్ర నాయకత్వంలో ఆందోళన మొదలైంది.

దిశ, ఇల్లెందు: ఇల్లెందు పురపాలక పోరులో ‘రెబల్’ సెగలు పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇరు పార్టీల అధికారిక అభ్యర్థులకు ఈ రెబల్స్ రూపంలో 'ఎదురుగాలి' వీస్తుండటంతో అగ్ర నాయకత్వంలో ఆందోళన మొదలైంది. పట్టణంలోని 24 వార్డులలో 65కు పైగా రెబల్స్ అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఫలితాలు ఎవరు ఊహించని రీతిలో ఉంటాయని స్పష్టంగా తెలుస్తుంది.

తగ్గేదే లేదంటున్న నేతలు

రెబల్ అభ్యర్థులను దారికి తెచ్చుకోవడానికి పార్టీ పెద్దలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఫోన్ కాల్స్, రాయబారాలు, భవిష్యత్తులో పదవుల ఆశ చూపుతున్నప్పటికీ అసమ్మతి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. ‘ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు లేకపోవడమేంటని’ ప్రశ్నిస్తూ, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని భీష్మించుకు కూర్చున్నారు. కాంగ్రెస్‌కు గ్రూపు రాజకీయాల దెబ్బ: నియోజకవర్గంలో పట్టున్న కీలక నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడం హస్తం పార్టీకి మింగుడు పడటం లేదు. ఓట్ల చీలికతో విజయావకాశాలు దెబ్బతింటాయనే భయం క్యాడర్‌లో కనిపిస్తోంది.

బిఆర్ఎస్‌లో అంతర్గత పోరు: కారు పార్టీలోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సిట్టింగ్ అభ్యర్థికి వ్యతిరేకంగా కొందరు సీనియర్ నేతలు రెబల్‌గా మారడం పార్టీకి పెద్ద సవాలుగా మారింది. రెబల్స్ చీల్చే ఓట్లు ఏ పార్టీని ముంచుతాయో, ఏ పార్టీని గెలిపిస్తాయో అర్థం కాక ఓటర్లు సైతం అయోమయంలో ఉన్నారు. ప్రధానంగా ఎస్టీ సెగ్మెంట్‌లో ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. "మా సత్తా ఏంటో పోలింగ్ రోజే చూపిస్తాం. ఇన్నాళ్లూ మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల కోసమే ఈ పోరాటం. వెనక్కి తగ్గేప్రసక్తే లేదు అంటూ రెబల్స్ బాహాటంగానే పేర్కొంటుండటం గమనార్హం.

Next Story