రవీందర్ రెడ్డి నీది ఏ పార్టీనో చెప్పాలి

by Nallavelli.Anjaneyulu |

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి విలేక‌ర్ల సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా

రవీందర్ రెడ్డి నీది ఏ పార్టీనో చెప్పాలి
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి విలేక‌ర్ల సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న‌ నియోజకవర్గం బాన్సువాడ అని అన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 137 ఉండగా.. మా నాయకుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు 111 మంది గెలుపొందారని తెలిపారు. 16 మంది రెబల్స్, బి.ఆర్.ఎస్.04, బీజేపీ 06 గురు మొత్తం 137 మందికి పెద్ద ఎత్తున మా అభ్యర్థులను గెలిపించిన గ్రామాల ఓటర్లు, నాయకులకు ధన్యవాదములు తెలియ‌జేశారు.


జడ్పీటీసీ ఎన్నిక‌ల్లో తమ సత్తా చాటుతామని అన్నారు. ఇక్కడ ప్రతిపక్షమే లేదని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నీది ఏ పార్టీ తెలపాలని బిర్కూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఆయన ఇంటికి పోయి పూల దండలు వేసి సన్మానించావు. గెలిచిన వారందరూ మా పార్టీ అంటున్నావు బీజేపీ వారు కూడా నివారేణ నీది ఏ పార్టీ తెలపాలని డిమాండ్ చేశారు. నీ సొంత గ్రామంలో నీవు నిలబెట్టిన అభ్యర్థి ఓటమి చెందాడు రవీందర్ రెడ్డి నీ ఉనికి లేదు ప్రజలకు తప్పు దోవ పట్టించకు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్ బిన్ మొహసిన్, మాజీ ఎం.పి.పి. మహమ్మద్ ఏజస్,మోహన్ నాయక్, పిట్ల శ్రీధర్, నార్ల రవీందర్,దాసరి శ్రీనివాస్, ఖలేక్, అబ్దుల్ వహాబ్ పాల్గొన్నారు.

Next Story