నూత‌న దంప‌తుల‌కు రేష‌న్ కార్డు బ‌దిలీ సుల‌భ‌త‌రం

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆర్మూర్ : గత కొద్ది రోజుల నుంచి కొత్త రేషన్ కార్డు కు వచ్చే సమస్యలపై కొత్త పెళ్లి అయిన వారు రేషన్ కార్డు

నూత‌న దంప‌తుల‌కు రేష‌న్ కార్డు బ‌దిలీ సుల‌భ‌త‌రం
X

దిశ, ఆర్మూర్ : గత కొద్ది రోజుల నుంచి కొత్త రేషన్ కార్డు కు వచ్చే సమస్యలపై కొత్త పెళ్లి అయిన వారు రేషన్ కార్డు నమోదు కొరకు ముందు డిలేట్ చేయాలి తర్వాత మళ్లీ అప్లై చేయాలి అనే వ్యవహారం చాలా ఇబ్బంది కరంగా ఉందని, దంపతుల పెళ్లి తర్వాత వారి రేషన్ కార్డుల బదిలీ ప్రక్రియను సులభతరం చేయాలన్న రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే.ఆర్. సురేష్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ, కొత్త & పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఈ ఏడాది అక్టోబర్ 30న ఇచ్చిన తన ఉత్తరంలో, ఈ విషయం ఇప్పటికే పరిశీలించబడిందనీ, సెప్టెంబర్ 26న NIC హెడ్‌క్వార్టర్స్‌కు అవసరమైన విధంగా SMART PDS లో లాజిక్ అమలుకు సూచించిందని మంత్రి తెలిపినట్లు నిజామాబాద్ జిల్లా మీసేవ నిర్వాహకులు చేపూర్ షాహిద్ సోమవారం తెలిపారు. ఈ విషయం కోడింగ్ టీమ్‌ కు కూడా దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. ఈ స్పందనకు ఎంపీ సురేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇది వేలాది మంది కొత్తగా పెళ్లైన పౌరులకు ఉపయోగపడు తుందన్నారు. ఒక కుటుంబం నుంచి పేరును వేరే రేషన్ కి కుటుంబంలోకి పేరు షిఫ్ట్ చేసి ప్రక్రియ ఇవ్వడం జరుగు తుందని ఈ చర్యలతో రేషన్ కార్డు బదిలీ ప్రక్రియ మరింత వేగవంతం, సులభతరం కానుందని, అన్ని రాష్టాల్లో ఈ ప్రక్రియ అమలు అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా చెందిన మీసేవ నిర్వాహకులు చేపూర్ షాహిద్ కోరారు.

Next Story