కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు

by Naveena |

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోర్టు సమీపంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు రంజాన్ ముబారక్ తెలుపుకున్నారు. ప్రార్థనలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలు కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్ ను సేవించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీసులు, ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దిన్ ను కలిసి ఆ పార్టీ నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story