- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజంపేటలో వాహన తనిఖీల్లో పట్టుబడ్డ దొంగ
by Bhanu |
రాజంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఎన్. ప్రేమ్ సింగ్, మహమ్మద్ అజీమ్ సోమవారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో తెల్లవారుజామున అనుమానాస్పదంగా వాహనంపై తిరుగుతున్న ఒక వ్యక్తిని నిలిపి తనిఖీ నిర్వహించారు.

X
దిశ, రాజంపేట: రాజంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఎన్. ప్రేమ్ సింగ్, మహమ్మద్ అజీమ్ సోమవారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో తెల్లవారుజామున అనుమానాస్పదంగా వాహనంపై తిరుగుతున్న ఒక వ్యక్తిని నిలిపి తనిఖీ నిర్వహించారు. అతని వాహనంలో దొంగతనానికి సంబంధించిన నగదు, వస్తువులు బయటపడటంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత విచారణలో బిక్నూర్ మండలం, కామారెడ్డి పట్టణంలో అతడు ఇటీవల చేసిన దొంగతనాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ పుష్పరాజ్ తెలిపారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా పని చేసి నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లను ఎస్‌ఐ పుష్పరాజ్ ప్రశంసించారు.
Next Story






