యూరియా కోసం చెప్పుల క్యూ..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, భిక్కనూరు : వరి నాట్లు పడుతుండడంతో యూరియా కొర‌త ఏర్ప‌డుతుంది. ఈ సీజ‌న్ లో రైతుల‌కు యూరియా అవ

యూరియా కోసం చెప్పుల క్యూ..!
X

దిశ, భిక్కనూరు : వరి నాట్లు పడుతుండడంతో యూరియా కొర‌త ఏర్ప‌డుతుంది. ఈ సీజ‌న్ లో రైతుల‌కు యూరియా అవసరం ఎక్కువ‌గా ఉండడంతో అందుకోసం చెప్పులు క్యూలో పెట్టి నిల్చున్న వైనం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. 444 బస్తాల యూరియాలోడ్ సొసైటీ గోదామ్ కి వచ్చిందన్న సమాచారంతో రైతులు వేకువ జాము నుంచి చెప్పులు క్యూలో పెట్టి నిల్చున్నారు. వారి సమయం ప్రకారం.. సొసైటీ తెరుచుకున్న వెంటనే ఒక్కసారిగా రైతులు పెద్ద ఎత్తున సోసైటీ వద్దకు చేరుకున్నారు. సొసైటీ సీఈఓ మహేశ్వరి మాట్లాడుతూ క్యూలో ఉన్న రైతులందరికీ యూరియా బస్తాలను పంపిణీ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్ ల‌ను చూసి ఆగం కావద్దని, నాట్ల సమయం కాబట్టి రైతుల కోసం యూరియాను తెప్పించడం జరిగిందన్నారు. రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా క్యూ ప్రకారం వచ్చి బస్తాలను తీసుకెళ్లాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Next Story