- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్ : తాగునీటి వృధాపై స్పందించిన అధికారులు
by Bhanu |
కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పబ్లిక్ కుళాయిలకు ట్యాప్‌లు లేకపోవడంతో ఉదయం నుంచి నీరంతా వృధాగా రోడ్ల పాలవుతుంది.

X
దిశ, కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పబ్లిక్ కుళాయిలకు ట్యాప్‌లు లేకపోవడంతో ఉదయం నుంచి నీరంతా వృధాగా రోడ్ల పాలవుతుంది. అనే సమస్యపై 'దిశ ' దినపత్రికలో బుధవారం "ప్రతిరోజు తాగునీటి వృథా" ప్రచురితమైన కథనానికి మండల అధికారులు స్పందించారు. గ్రామంలోని పబ్లిక్ కుళాయిలకు ట్యాపులు బిగించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్, ఎంపీవో సదాశివ్ లు స్థానిక కార్యదర్శి గంగా జమున, గ్రామపంచాయతీ సిబ్బందిని గ్రామంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






