- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణి ఎఫెక్ట్..
వెంచర్ లో గ్రామపంచాయతీ కోసం టెన్ పర్సెంట్ ఇచ్చిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి సొంతానికి వాడుకుంటున్న కౌసల్య దేవి ఫౌండేషన్ పై జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఆర్టీఐ జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగం ఎట్టకేలకు కదిలి వచ్చింది.

ప్రజావాణి ఎఫెక్ట్..
- అధికారులు దగ్గరుండి వెంచర్ లో అక్రమ నిర్మాణాల తొలగింపు
- ఆర్టీఐ జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
దిశ,భిక్కనూరు : వెంచర్ లో గ్రామపంచాయతీ కోసం టెన్ పర్సెంట్ ఇచ్చిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి సొంతానికి వాడుకుంటున్న కౌసల్య దేవి ఫౌండేషన్ పై జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఆర్టీఐ జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగం ఎట్టకేలకు కదిలి వచ్చింది. దక్షిణ కాశీ సిద్ధ రామేశ్వరాలయం సమీపంలో ఉన్న కౌసల్య ఫౌండేషన్ పేరుతో వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ వెంచర్ లో ఇచ్చిన టెన్ పర్సెంట్ స్థలంలో అక్రమంగా ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టడమే కాకుండా, షెడ్డు వేసి సొంతానికి వాడుకుంటున్నారని రెండుసార్లు ఫిర్యాదు చేయడంతో, ఈ మేరకు కామారెడ్డి డీఎల్పీఓ మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, గ్రామపంచాయతీ ఈఓ కే.మహేష్ గౌడ్, అధికార యంత్రం కదిలి వచ్చి వెంచర్ లో అక్రమంగా నిర్మించిన షెడ్డును, పెన్సింగ్ ను దగ్గరుండి తొలగింపజేశారు.






