- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతొందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీడీవో శివకృష్ణ పేర్కొన్నారు.

దిశ, నిజాంసాగర్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతొందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీడీవో శివకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని పీఎం టీజీఎంఎస్ అచ్చంపేట్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ఎంపీడీవో శివకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన సమ్మర్ క్యాంప్‌లను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహించడం ద్వారా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగుతోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో భాగంగా నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ, ఇండోర్ ఆటలు, యోగా, కళలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. నిజాంసాగర్ మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు సమ్మర్ క్యాంప్‌లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్‌నగర్ మండల విద్యాశాఖాధికారి వెంకటేశం, అచ్చంపేట్ సర్పంచ్ లక్ష్మయ్య, టీజీఎంఎస్ అచ్చంపేట్ ప్రిన్సిపల్ కార్తీక సంధ్య, వైస్ ప్రిన్సిపల్ సాయిబాబా, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






