- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 27 న కూరగాయల స్టాల్స్ బహిరంగ వేలం..
నిజామాబాద్ నగరంలోని గాంధీగంజ్ మార్కెట్ యార్డులో నిర్మించిన కూరగాయల స్టాళ్ళను నెలవారి అద్దె ప్రాతిపదికన ఈనెల 27 బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు ఏఎంఎస్‌సి.హెచ్. శివకుమార్ తెలిపారు.

దిశ, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలోని గాంధీగంజ్ మార్కెట్ యార్డులో నిర్మించిన కూరగాయల స్టాళ్ళను నెలవారి అద్దె ప్రాతిపదికన ఈనెల 27 బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు ఏ ఎం ఎస్ సి.హెచ్. శివకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈనెల 27 న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ వేలంలో పాల్గొనేందుకు అర్హులైన కూరగాయల రిటైల్ వ్యాపారుల నుండి ఈనెల 18 నుండి 25 వరకు ధరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల వ్యాపారులు రూ. 500 లు చెల్లించి ఈ కార్యాలయ పనివేళలలో ధరఖాస్తులను పొందాలని సూచించారు. ఈనెల 25 న సాయంత్రం 5 గంటల్లోపు వ్యాపారులు తమతమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. స్టాల్ యొక్క కనీస నెలవారి అద్దె రూ. 1500 లుగా నిర్ణయించినట్లు శివకుమార్ తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొనేవారు గతంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటి నుండి ఖరీదుదారు లైసెన్స్‌ను విధిగా పొంది ఉండాలన్నారు. గాంధీగంజ్ లో నిరంతరముగా కూరగాయల వ్యాపారము చేస్తూ, ఈ కార్యాలయముచే నిర్వహించబడుతున్న అటెండెన్స్ రిజిస్టర్‌లో పేరు కూడా నమోదు చేయబడిన వారు మాత్రమే అర్హులని ఆయన స్పష్టం చేశారు. ఇతర వివరముల కొరకు మార్కెట్ కమిటీ కార్యాలయ పనివేళలలో ఏ ఎం ఎస్ సి.హెచ్. శివకుమార్ ను సెల్ నెం. 9603144081 ద్వారా సంప్రదించాలని ఆయన ప్రకటనలో కోరారు.






