డీఈఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత

by velandi.Saikiran |   (  Updated:2026-06-18 10:32:40  IST  )

కరీంనగర్ కేంద్రంలోని డీఈఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

డీఈఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: కరీంనగర్ కేంద్రంలోని డీఈఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఈఓ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను అరికట్టాలని డీఈఓ ఆఫీసును ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున మొహరించి, డీఈవో బయటికి రావాలంటూ నినాదాలు చేసారు ఏబీవీపీ నాయకులు. డీఈవో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ త‌రుణంలోనే వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Next Story