- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ ట్రాప్ లో బొల్లారం విద్యుత్ ఏఈ రామకృష్ణ రెడ్డి
జిన్నారం మండలం బొల్లారం డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు.

దిశ, జిన్నారం: జిన్నారం మండలం బొల్లారం డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సమాచారం ప్రకారం.. బొల్లారంలోని పీపీఆర్ హాస్పిటల్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ కాంట్రాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదు కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తి నుంచి ఏఈ రామకృష్ణారెడ్డి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం లంచం ఇస్తుండగా అధికారులు దాడి చేసి ఏఈని పట్టుకున్నారు. అనంతరం బొల్లారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు, విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






